నేడు (26-01-2024 – శుక్రవారం) వృషభ రాశి వారు సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. మిథునరాశి వారికి పెట్టుబడులు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి నూతన భాగస్వామ్యాల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తారు. రియల్ ఎస్టేట్; నిర్మాణ రంగాల వారు కొత్త పథకాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సంకల్పం ఫలిస్తుంది.
వృషభం (ఏప్రిల్ 21 – మే 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితులతో దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులకు శుభప్రదం. రవాణా, బోధన, ఏజెన్సీ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరం. కమ్యూనికేషన్ రంగంలోని వారికి లాభిస్తుంది. శుభవార్త అందుకుంటారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. మ్యూచ్యువల్ ఫండ్స్, షేర్‌మార్కెట్ లావాదేవీలకు అనుకూల సమయం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైన లక్ష్య సాధనకు అనుకూలం. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.
కర్కాటకం (జూన్ 22 – జూలై 23 మధ్య జన్మించిన వారు)
నూతన భాగస్వామ్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. పదిమందిలో మంచి పేరు సంపాదిస్తారు. న్యాయవివాదాలు పరిష్కారం అవుతాయి. స్పెక్యులేషన్లు, పెట్టుబడులు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి.
సింహం (జూలై 24 – ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉత్సవాలు, ప్రదర్శనలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, రక్షణ, రవాణా రంగాల వారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా వుంటుంది. దుర్గామాత ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 – సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
క్రీడలు, ఆడిటింగ్, టెలివిజన్, విద్యా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్, క్రయవిక్రయాలకు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. లలితాదేవి ఆరాధన మేలు చేస్తుంది.
తుల (సెప్టెంబరు 24 – అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు, సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు అందుకుంటారు.
వృశ్చికం (అక్టోబరు 24 – నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, ఆడిటింగ్ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా వుంటుంది. అంచనాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
ధనుస్సు (నవంబరు 23 – డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలు, చిట్ఫండ్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. పెన్షన్ బీమా, గ్యాట్యుటీ లావాదేవీలకు అనుకూలం. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. ఫీజులు చెల్లిస్తారు. గతించిన సన్నిహితులను స్మరించుకుంటారు. సేవాకార్యక్రమాలు సంతృప్తినిస్తాయి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకలు, ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శుభకార్యాలకు అనుకూలం. కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు.
కుంభం (జనవరి 21 – ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్పత్రులు, హాస్టళ్లు, హోటల్ రంగాల వారు శుభవార్త అందుకుంటారు. సన్నిహితు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు.
మీనం (ఫిబ్రవరి 20 – మార్చి 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులకు శుభప్రదం. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. పొదుపు పథకాలు, చిట్‌ఫండ్ వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది.
– బిజుమళ్ళ బిందుమాధవ శర్మ